JANA GANA MANA

Promoting indian languages
search BLOGS
Login
Add your comments
Want to contribute?
Join JANAGANAMANA



Print this page.




శివరంజని sivaranjani

singer
నవమినాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి కార్తీక పున్నమి రేయి
 నవమినాటి ||  

నీ వయసే వసంత ఋతువై  నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవిగా నీ నగవే సిగ మల్లికగా
చెరి సగమై ఏ సగమేదో మరచిన మన తొలి కలయకలో
 నవమినాటి ||  

నీ ఒడిలో వలపును నేనై నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతిగా అందించే నా పార్వతిగా
మనమొకటై రస జగమేలే సరస మధుర సంగమ గీతికలో
 నవమినాటి ||